68th National Film Awards: ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవగన్

శుక్రవారం 2020లో విడుదలైన సినిమాలకు 68వ జాతీయ అవార్డుల విజేతలను ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Best Actors

Best Actors

శుక్రవారం 2020లో విడుదలైన సినిమాలకు 68వ జాతీయ అవార్డుల విజేతలను ప్రకటించారు. సూర్యకు ఉత్తమ నటుడు, అపర్ణ బాలమురళికి ఉత్తమ నటి అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రంతో తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’ నిలిచింది. ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’ చిత్రానికిగానూ అజయ్ దేవగన్‌, తమిళ హీరో సూర్యతో కలిసి ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. తాన్హాజీ  సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా నిలిచింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 సంవత్సరం సినిమా గమనాన్ని మార్చేసింది. థియేటర్లు లాక్‌డౌన్‌లో ఉన్నందున, పలువురు చిత్రనిర్మాతలు రూట్ మార్చారు. OTTలో థియేట్రికల్ మూవీలను విడుదల చేశారు. అయినా ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి. సూర్య ‘సూరై పొట్రు’, పి విరుమాండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కా పే రణసింహం’ దేశవ్యాప్తంగా  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ సంవత్సరం ప్రాంతీయ కంటెంట్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని అవార్డులను ప్రకటించారు.  ఇక జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సైతం సత్తా చాటాయి. అవి ఏమిటంటే…

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 

ఎస్ ఎస్ తమన్

(అలా వైకుంఠపురం లో)

Best Choreographer

సంధ్య రాజు (నాట్యం)

బెస్ట్ రీజనల్ తెలుగు ఫిల్మ్

“కలర్ ఫోటో”

  Last Updated: 22 Jul 2022, 05:31 PM IST