Site icon HashtagU Telugu

Liquor Bottles : క‌ర్నూల్ లో అక్ర‌మ మ‌ద్యం సీసాల ధ్వంసం.. వాటి విలువ ఎంతంటే..?

1600x960 984472 Liquor Bottles Imresizer

1600x960 984472 Liquor Bottles Imresizer

కర్నూలు జిల్లాలో మ‌ద్యం సీసాల‌ను పోలీసులు ధ్వంసం చేశారు. 2021-2022 సంవత్సరంలో నమోదైన 593 కేసుల్లో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో శనివారం కర్నూలు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

దాదాపు 66 వేల మద్యం బాటిళ్లను అక్ర‌మ ర‌వాణా ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఇబి తెలిపింది. కర్నూలులోని పంచలింగాల గ్రామం నుంచి తాండ్రపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఈబీ తెలిపారు. దేశవ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాలని ఎస్‌ఈబీ పోలీసులకు సూచించింది.