Site icon HashtagU Telugu

Ganja Seized : ఖ‌మ్మం జిల్లాలో 63 కేజీల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌

Ganja

Ganja

ఖమ్మం జిల్లాలో 63 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో గంజాయిని క‌లిగి ఉన్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐదుగురు వ్యక్తుల నుంచి సుమారు 63 కిలోల గంజాయిని స్వాధీనం, ఒక ద్విచక్ర వాహనం, కారు కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు.

పక్కా సమాచారంతో కూసుమంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొప్పుల సతీష్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నందీప్‌ ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా వెంకటేశ్‌, నవీన్‌, శ్రీనివాస్‌, రమేష్‌, శ్రీరామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబాబాద్ జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వారిని బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version