విజయవాడ నున్న వద్ద అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ప్రీమియం లిక్కర్ నుంచీ చీప్ లిక్కర్ వరకూ ఉన్న మద్యం బాటిళ్ళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. రోడ్ రోలర్ తో మద్యం బాటిళ్ళు తొక్కించారు. 62, 500 మద్యం బాటిళ్ళు ధ్వంసం చేశామని ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ క్రాంతిరాణా టాటా తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో రూ.2 కోట్లు విలువైన ఎన్.డి.పి.ఎస్ లిక్కర్ సీజ్ చేశామని..8,877 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయని తెలిపారు. సెక్షన్ 34ఏ కింద అక్రమ మద్యం ధ్వంసం చేస్తున్నామని.. మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ల్లో నాటు సారా తయారీపై 4 పిడి యాక్ట్ కేసులు పెట్టామని కమిషనర్ తెలిపారు. అక్రమ మద్యం పట్టుబడితే 14 రోజులు జుడీషియల్ రిమాండ్, నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయని కమిషనర్ క్రాంతిరాణా తెలిపారు.
Liquor Bottles Destroyed : రెండు కోట్ల రూపాయల అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు

liquor destroyed