Site icon HashtagU Telugu

See Pics: నాడు కూలీ.. నేడు మోడల్!

Viral

Viral

కేరళకు చెందిన 60 ఏళ్ల రోజువారీ కూలీ తన విభిన్నమైన గెటప్స్ ట్రెండ్ సెట్టర్ గా మారాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క తన మాసిపోయిన లుంగీ, చొక్కాను సూట్‌, సన్‌గ్లాసెస్‌ ధరించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ మోడల్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మమ్మిక్కా స్పందిస్తూ ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలిల్‌కు రుణపడి ఉన్నానని, ఆయన వల్లే గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.

ఫొటో గ్రాఫర్ షరీక్ మమ్మిక్క ఫోటోను తీసి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసాడు. ఈ కూలీ యాక్టర్ వినాయకన్‌ను పోలి ఉన్నందుకు ఫోటో వైరల్‌గా మారింది.  ఊహించనిరీతిలో రెస్పాన్స్ రావడంతో ఫొటోగ్రాఫర్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడలింగ్ చేయమని మమ్మికను కోరాడు. ఫోటో షూట్‌కు ముందు, ఆ తర్వాత 60 ఏళ్ల మేక్ఓవర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించిన వీడియో ఆకట్టుకుంది. ఈ వీడియో 23,000 వ్యూస్ దక్కించుకుంది. తన కంపెనీకి మోడల్‌గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ చెప్పారు. మమ్మిక్కా క్లాసిక్ బ్లేజర్, ప్యాంటు ధరించి, చేతిలో ఐప్యాడ్‌తో ఉన్న ఫొటోలు ప్రతిఒక్కరీని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.