Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 21, 2021 / 10:25 PM IST

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణాలో పిల్లలకు సంబందించిన వాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దవారికి ఉచిత వాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికి తెలంగాణాలో 1.4% మంది మొదటి డోస్ వాక్సిన్ తీసుకోలేదు. 40% మంది రెండవ డోస్ వాక్సిన్ వేసుకోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

18 ఏళ్ళు దాటిన 2,77,67,000 మంది అర్హులైన లబ్ధిదారుల్లో మొత్తం 2,73,84,439మంది మొదటి డోస్ వేసుకున్నారు. అంటే దాదాపు 98.62%మంది మొదటి డోస్ తీసుకున్నారు. ఇక రెండవ డోస్ 1,67,92,902మంది తీసుకున్నారు. అంటే దాదాపుగా 60.4% మంది రెండవ డోస్ వేసుకున్నారు.

తెలంగాణాలో డిసెంబర్ చివరిలోపు వందశాతం వాక్సినేషన్ సాధించేదిశగా కృషి చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వాక్సినేషన్ విషయంలో గ్రౌండ్ లెవల్ హెల్త్ వర్కర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నారని హరీష్ రావు కొనియాడారు.

ఇక తెలంగాణాలో కరోనా కేసులు కూడా కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. మంగళవారం 172 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,79,892కి చేరింది.