Peddapalli: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకుని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు.
అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితురాలి తల్లి లేచి చూడగా కూతురు కనిపించకుండా పోవడంతో ఇతరుల సహాయంతో చుట్టుప్రక్కల గాలించారు. అయితే రైస్ మిల్లు సమీపంలో బాలిక శవమై పడి ఉండటాన్ని గుర్తించారు. అనుమానంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ బలరామ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాలికను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పెద్దపల్లిలో కలకలం రేపింది.
పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.
Also Read: Bigg Boss Season 8 : బిగ్ బాస్ ని వదలని శివాజి.. సీజన్ 8లో కూడా..?