Site icon HashtagU Telugu

India: నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థానీలను హతమార్చిన పోలీసులు

Template (93) Copy

Template (93) Copy

నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థాన్ పౌరులను హతమార్చినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బుధవారం సాయంత్రం అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లోనిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో వారిని హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ లో చనిపోయిన వారందరూ కూడా జైష్ ఈ మహమూద్ అనే ఉగ్రవాద ముఠాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్ తో మేము ఒక పెద్ద విజయాన్ని అందుకున్నామని ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ విజయ్ కుమార్ అన్నారు.

Exit mobile version