Site icon HashtagU Telugu

Shani God: శని దేవుడు చిన్న చూపు చూస్తున్నాడని చెప్పే 6 సంకేతాలు ఇవే..వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా?

Shani

Shani

సాధారణంగా చాలామంది శనీశ్వరుడు లేదా శని దేవుడు పేరు వినగానే తెగ భయపడిపోతూ ఉంటారు. ఇంకొందరు అయితే శని దేవుడు నీ పేరు పిలవాలి అన్న, శని దేవుడిని పూజించాలి అన్న భయపడుతూ ఉంటారు. కానీ ఇంకొందరు మాత్రం శని దేవుడిని ఆయనకు ఇష్టమైన విధంగా భక్తిశ్రద్ధలతో పూజించి సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకే జ్యోతిష్య దర్శనం ప్రకారం శని దేవుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తూ ఉంటారు. అంతేకాకుండా శని దేవుడు శుభ అశుభ ఫలితాలను కూడా ఇస్తారని చెబుతుంటారు. ఇదే పొరపాటున శని దేవుడు వక్ర దృష్టితో ఏ వ్యక్తిని అయినా కానీ చూశాడు అంటేచెడుకాలం ప్రారంభమవుతుంది అని చెబుతుంటారు.

మన జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇది శని అశుభ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక నష్టం లాంటివి శని అశుభ ఫలితాల సంకేతంగా చెప్పుకోవచ్చు. అనుగ్రహం అశుభ ప్రభావం వల్ల మనిషి అనుకోకుండా అనేక సమస్యలను ఎదురుకోవడంతోపాటు ప్రతి ఒక్క పనిలో కూడా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అదేవిధంగా శనిగ్రహం ఆగ్రహించినప్పుడు అనవసరంగా వివాదాలు చిక్కుకోవడం పరువు గౌరవం అని పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

శని గ్రహం ఆగ్రహించడం మొదలైతే చెడు అలవాట్లకు బానిస అవ్వడమే కాకుండా దొంగతనం జూదం ఇలాంటి చెరువు అలవాట్లకు ఆకర్షితులవుతారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే పేదరికం మొదలయ్యి దురాశ పెరగడం ప్రారంభం అవుతుంది. మనిషి కూడా భక్తిహీనుడు అయ్యి మతపరమైన పనులను చేయాలి అనిపించదు. శని దేవుడు పట్టిపీడిస్తున్నట్లుగా అనిపిస్తే మన నుదుటిమీద తేజస్సు లేకుండా పోవడం నలుపు రంగు కూడా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శ‌ని మ‌హాద‌శ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప‌రిహారాలు ఏంటి అన్న విషయానికి వస్తే..శ‌ని శ్రేయ‌స్సు పొంద‌డానికి అమ‌వాస్య రోజు ప‌విత్ర న‌దిలో స్నానం చేసి పేద‌ల‌కు వారి శ‌క్తికి త‌గ్గ‌ట్టు బ‌ట్ట‌లు, ఆహారాన్ని దానం చేయాలి. అలాగే శ‌నివారం రోజు అశ్వ‌థ వృక్షానికి నీటిని నైవేద్యంగా పెట్ట‌డం వ‌ల్ల కూడా శ‌ని గ్ర‌హం యొక్క దోషం పోతుంది. అదేవిధంగా శని అశుభాలను త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌తి శ‌నివారం కూడా శ‌ని దేవుడికి ఆవ‌నూనె స‌మ‌ర్పించండి. అదేవిధంగా ఆవ‌నూనె దీపం వెలిగించి శ‌ని చాలీసా ప‌ఠించడం వల్ల శ‌ని వారాల్లో ఇనుప వ‌స్తువులు, న‌ల్ల‌ని వ‌స్త్రాలు, ప‌ప్పు ఆవ‌నూనె, పాదుక‌లు త‌దిత‌ర వాటిని దానం చేయ‌డం వ‌ల్ల శ‌ని దేవుడు ప్ర‌స‌న్నుడ‌వుతాడు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.