Site icon HashtagU Telugu

Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video

Road Accident

New Web Story Copy 2023 07 11t093916.803

Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం…విజయ్ నగర్ మరియు తిగ్రీ మధ్య ఎక్స్‌ప్రెస్‌వేపై పాఠశాల బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సు ఖాళీగా ఉంది. స్కూల్ బస్సు రాంగ్‌ రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న వ్యాన్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అమాయకులు మృతి చెందడం బాధాకరం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పిల్లలు ఉంటే పెను ప్రమాదం జరిగే ఉండేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. కాగా ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More: Andhra Prdesh : ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదం పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిగ్బ్రాంతి