Site icon HashtagU Telugu

Earthquake: ఆరుగురు మృతి..నేపాల్‌లో భారీ భూకంపం

Earhtquake Imresizer

Earhtquake Imresizer

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ తెలిపింది. భూకంప కేంద్రం దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్‌ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం సంభవించిందని వెల్లడించారు.

VIDEOS: