Site icon HashtagU Telugu

AP News: విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

Gold Rates

AP News:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ప్రత్యేక పోలీసుల బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులకు డబ్బుతో పాటు బంగారు నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం దొరికింది. విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో భారీ డబ్బు పట్టుబడుతోంది.

ఏపీలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి, ఇంకోవైపు కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహ్యాత్మకంగా ప్రచారం చేస్తున్నాయి.  కాగా ఏపీ లో కూటమికి 160 కి పైగా అసెంబ్లీ స్థానాలు , సుమారు 24 పార్లమెంట్ స్థానాలు ఖాయం ఓ … టీవీ ఇంటర్వ్యూ లో చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి , సంక్షేమం , సాధికారత కోసమే బీజేపీ తో పొత్తు అని, జగన్ అరాచకపాలన తో ప్రజలు భయకంపితులు అవుతున్నారని చంద్రబాబు అన్నారు.