Site icon HashtagU Telugu

Earthquake: భారీ భూకంపం.. ప‌రుగులు తీసిన ప్రజ‌లు..!

6.8 Magnitude Earthquake

6.8 Magnitude Earthquake

మ‌లేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థ‌రాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత న‌మోద‌వ‌డంతో అక్క‌డి ప్ర‌జలు భ‌యంతో రోడ్లపై పరుగులు తీశారు. మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ స‌మీపంలో రిక్ట‌ర్ స్కేలుపై 6.8 తీవ్ర‌త న‌మోదైంది. మ‌రోవైపు ఫిలిప్పీన్స్‌లో రిక్ట‌ర్ స్కేలుపై 6.4 తీవ్ర‌త న‌మోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్ట‌ర్ స్కేలు పై తీవ్ర‌త 6 దాట‌డంతో ఆస్థిన‌ష్టం భారీగానే జ‌రిగి ఉంటుంద‌ని అంచానా వేస్తున్నారు. అయితే రెండు దేశాల్లో ప్రాణనష్టం మాత్రం లేదని తెలుస్తోంది.

ఇక మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ నగరానికి నైరుతి దిశలో 504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మ‌రోవైపు అటు ఫిలిప్పీన్‌లోని మనీలా రాజధానికి 157 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం గుర్తించారు. రెండు దేశాల్లోనూ ఒకేసారి రెండు భూకంప కేంద్రాలతో భూమి కంపించడంపై కారణాలను భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక రెండు దేశాల్లో దాదాపు ఒకే సమయంలో అంటే అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సిఉంది.