Site icon HashtagU Telugu

Earthquake: జపాన్ లో మరోసారి భారీ భూకంపం.. కానీ సునామీ గురించి నో వార్నింగ్?

Earthquake

Earthquake

జపాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని ప్రదేశాల లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. భూకంపంతో జపాన్ మొత్తం కూడా వణికిపోయింది. తాజాగా నేడు అనగా మంగళవారం జపాన్ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది.

తాజాగా ఈ భారీ భూకంపం సాయంత్రం 6.18 లకు ఇరవై కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు అని జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు జపాన్ ప్రభుత్వం సునామి హెచ్చరికలను జారీ చేయలేదు. కాగా జపాన్ భూభాగం అత్యంత భారీ భూకంపాలు వచ్చే ప్రదేశంలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం ఆగ్నేయ యాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం..

ఆ ప్రాంతంలో సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఉన్నందువల్లే జపాన్ అత్యంత కఠినమైన నిర్మాణాలు కలిగి ఉంది. 2011లో జపాన్ సమీపంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దాని దాటికి సునామీ అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసేసాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసి పడిన రాకాసి అలల కారణంగా 20 వేలకు పైగా ప్రజలు మరణించారు.

Exit mobile version