5G In India: ‘5జీ’కి డేట్ ఫిక్స్.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?

5G In India: భారత్ లో 5జీ సేవలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల త్వరలోనే ప్రారంభం కానున్నాయి అంటూ సమాచారం అందిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - September 24, 2022 / 05:30 PM IST

5G In India: భారత్ లో 5జీ సేవలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల త్వరలోనే ప్రారంభం కానున్నాయి అంటూ సమాచారం అందిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం భారత్లో 5జి సేవలు ప్రారంభం కావడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. రేపు నెల అనగా అక్టోబర్ 1వ తేదీన ప్రగతి మైదాన్‌లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను ప్రారంభించబోతున్నారు.

ఇదే ఈ విషయాన్ని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు..భారత్ లో డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ ఆసియాలో అతిపెద్దది టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా ప్రధాని మోదీ భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు అని ట్వీట్ లో పేర్కొంది.

కాగా భారత్ లో తక్కువ వ్యవధిలోనే 5G టెలికాం సేవలను 80 శాతం కవరేజీని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న భారత్ లోని వినియోగదారులు అనందం వ్యక్తం చేస్తున్నారు.