Rajastan: పింఛను తీసుకునే వయసులో పండంటి కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఎక్కడో తెలుసా?

మహిళలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే పెళ్లి అయిన తర్వాత కొందరు వివాహితులు తొందరగా గర్భం దాలిస్తే మరి కొంతమందికి ఏళ్లు గ

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 03:01 PM IST

మహిళలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే పెళ్లి అయిన తర్వాత కొందరు వివాహితులు తొందరగా గర్భం దాలిస్తే మరి కొంతమందికి ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు కలగలేదని బాధపడుతూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో పిల్లల్ని కన్నా దంపతులు చాలామంది ఉన్నారు. అలా పింఛను తీసుకునే వయసులో తల్లిదండ్రులు అయిన వారు ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్లోని బికనీర్ లో ఒక వృద్ధురాలు 58 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవల పిల్లల్లో ఒకరు కుమారుడు కాగా మరొకరు కుమార్తె. ఇద్దరు పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే… 58 ఏళ్ల షేరా బహదూర్ అనే వివాహితకు పిల్లలు లేరు. దాంతో చివరి ప్రయత్నంగా ఆమె ఐవిఎఫ్ ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఐవిఎఫ్ సహాయంతో పిల్లలకు పిల్లలకు జన్మనిచ్చేందుకు దాదాపు రెండేళ్ల పాటు చికిత్స చేయించుకుంది షేరా. ఎట్టకేలకు ఆమె గర్భం దాల్చి 9 నెలల తర్వాత ఏకంగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.

వృద్ధాప్య వయసులో పిల్లలు కావాలని దానికోసం ఎంతగానో పోరాడుతున్న ఆమెను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ ఐవిఎఫ్ ప్రక్రియ అంతా కూడా బికనీర్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. డాక్టర్ షెఫాలీ దధీచ్ షేరా పూర్తి సహాయం చేసింది.. రెండేళ్ల క్రితం తన వద్దకు షేరా వచ్చిందని, అప్పుడు తనకు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కనే అవకాశం ఉంది అని చెప్పి ఆ విధంగా చికిత్సను అందించాము. అలా 50 ఏళ్ల వయసులో కూడా తల్లి కావడానికి సహాయం చేసాము. మొదట్లో ఆమె వయసు ఆమె కోరిక విని అందరు ఆశ్చర్యం పోయారు అని డాక్టర్ తెలిపింది. కానీ ఐ వి ఎఫ్ విజయవంతం అయ్యి 58 సంవత్సరాల వయసులో కూడా తల్లి అవ్వడం అందులోనూ ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపింది.