Site icon HashtagU Telugu

Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar: తెలంగాణలో అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీపాలనపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ముఖ్య నేతలు తమకు కేటాయించిన శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పని తీరును సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, గిడ్డంగుల నిర్వహణ, రేషన్ వస్తువుల సరఫరా, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లబ్దిదారులకు పీడీఎస్ బియ్యం అందకుండా డైవర్ట్ అయింది. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెంచాల్సి ఉంది. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ను 100 రోజుల్లో అమలు చేస్తాం. అన్ని శాఖల్లో ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. సివిల్ సప్లై కార్పొరేషన్ 11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. పౌర సరఫరాల శాఖపై 56 వేల కోట్ల రుణం ఉంది. ఉన్న రేషన్ కార్డుల్లో బియ్యం తీసుకునేవారు 89 శాతం దాటలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

Also Read: Voter Registration : ఓటరు నమోదు, సవరణలకు మరో ఛాన్స్

అయితే ప్రజలకు అందిస్తున్న రేషన్ సక్రమంగా వారికి చేరుతుందా, వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది గమనించాలని అధికారులకు మంత్రి సూచించారు. కిలో 39 రూపాయలు పెట్టి సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ అవి పేదలు తినకపోతే ఇంత గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందన్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, తదితర అంశాలపై ఉత్తమ్ కుమార్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.