సాధారణంగా మనం ఈత కొట్టినప్పుడు లేదంటే ఏదైనా నీటిలో పడిపోయినప్పుడు నీటిలోకి దిగుతూ ఉంటాం. అలాగే సరదాగా గడపడానికి అలా సందర్భాన్ని బట్టి మీరు నీటి లోకి దిగుతూ ఉంటాము. నీటిలోకి దిగిన తరువాత కొద్ది క్షణాల్లోనే పైకి వచ్చేస్తూ ఉంటాము. అందుకు గల కారణం నీటిలో ఎక్కువసేపు శ్వాసను తీసుకోవడం కష్టం. నీటిలో ఎక్కువసేపు ఉంటే ప్రాణాలు పోతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నీటిలోకి దిగేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వెళితే కొన్ని గంటల వరకు ప్రాణాలతో ఉంటారు. అప్పుడు కూడా ఎక్కువ సేపు నీటిలో ఉండలేక వెంటనే పైకి వచ్చేస్తూ ఉంటారు.
కానీ నీటిలో ఏకంగా వంద రోజులు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా. ఈ ప్రశ్న వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే మాట చనిపోవడం ఖాయం. ఆ మాట వింటేనే ఒనుకు పుడుతూ ఉంటుంది. అటువంటి ఆలోచన ఒక ప్రొఫెసర్ కి వచ్చింది. దాన్ని నేను చేసిన నిరూపించాడు. ఇంతకీ ఆ ప్రొఫెసర్ చేసిన ప్రయోగం ఏమిటంటే.. 55 ఏళ్ల కళాశాల ప్రొఫెసర్ మాజీ నేవీ డ్రైవర్ తన పరిశోధనలో భాగంగా 55 చదరపు మీటర్ల అడుగున ఉపరితలం నుంచి దాదాపు 30 అడుగుల లోపల నివసిస్తున్నారు. ప్రొఫెసర్ జోసెఫ్ డిటూరి విపరీతమైన ఒత్తిడి దీర్ఘకాలంగా గురి కావడానికి మానవ శరీరం ఎలా స్పందిస్తుందో అని ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014లో టెన్నెస్సీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజుల పాటు నీటిలో నివాసం ఉన్నారు.
దానిని నూరు రోజులకు పొడిగించాలి అని ప్రొఫెసర్ లక్ష్యంగా పెట్టుకొని యూఎస్ నేవీ మాజీ డ్రైవర్ ఫ్లోరిడా లోని కీ లార్గోలో జూర్స్ అండర్ సీ లాడ్జిలో నూరు చదరపు అడుగుల ఆవాసంలో నివసిస్తున్నాడు. జోసెఫ్ డిటూరి ఆరోగ్యం ముఖ్యమైన పారామితులపై మనస్తత్వవేత్తలు మానసిక వైద్యుల బృందం నిశితంగా గమనిస్తోంది. మార్చి 1వ తేదీన ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని చెక్ అప్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగం వల్ల ఆయుర్ధామం పెరుగుతుందని వృద్ధాప్య సంబంధమైన వ్యాధులు దరిచేరమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.