చైనాకు ఇండియా మరోసారి జబర్ధస్త్ షాక్ ఇచ్చింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనా యాప్‌లను నిషేధం విధించాలని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫారసు చేయడంతతో, కేంద్ర ప్రభుత్వం 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారతదేశంలో ఈ చైనా యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
భారత్ నిషేధించిన యాప్‌ల జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్‌సెంట్ జీవర్, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ యాప్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, యాప్‌లాక్, ఆస్ట్రాక్రాప్ట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గత ఏడాదది, చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో PUBG మొబైల్, యూసీ బ్రౌజర్, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించింది. కాగా 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణ మొదలైన తర్వాత, ఇప్పటి వరకు భారత్ దాదాపు 300 యాప్‌లను నిషేధించడం విశేషం.
Govt of India to ban 54 Chinese apps that pose a threat to India’s security: Sources
— ANI (@ANI) February 14, 2022