Inter Exams: పరీక్షా హాల్‎లో 500 అమ్మాయిలు.. స్పృహ తప్పిన అబ్బాయి!

మనలో చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. భయాలనే వైద్యపరంగా ఫోబియా అని అంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 09:47 PM IST

Inter Exams: మనలో చాలామందికి రకరకాల భయాలు ఉంటాయి. భయాలనే వైద్యపరంగా ఫోబియా అని అంటూ ఉంటారు. కొందరికి ఎత్తులు అంటే భయం, మరికొందరికి నీళ్లంటే భయం. ఇంకొందరికి బొద్దింకలు అంటే భయం. ఇలా రకరకాల ఫోబియాల గురించి ఇప్పటి వరకు మనం వినే ఉంటాం. మన చుట్టూ ఇలాంటి ఫోబియాలు ఉన్న వ్యక్తులను చూసి ఉంటాం. కానీ తాజాగా ఓ అబ్బాయి ఉన్న భయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

బిహార్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఓ ఇంటర్ చదువుతున్న అబ్బాయి కూడా అందరిలా పరీక్ష రాయడానికి అని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అయితే పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అయిన ఆ అబ్బాయి.. ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. దాంతో అక్కడ ఉన్న టీచర్లు కూడా ఖంగారుపడిపోయి.. ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఆ అబ్బాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ అబ్బాయి ఎందుకు స్పృహ తప్పిపోయాడంటే.. చుట్టూ అమ్మాయిలు ఉండటం వల్ల. అవును మీరు చదువుతున్నది నిజమే.

బిహార్ లోని అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న మనీశ్ శంకర్ ను పరీక్షలు రాయడానికై అతడి తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ పరీక్షా కేంద్రమైన బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. పరీక్షా హాల్ లోకి ఎంటర్ అయిన మనీశ్ శంకర్.. తన హాల్ లో ఏకంగా 500 మంది అమ్మాయిలు ఉండటం, ఒక్క అబ్బాయి కూడా లేకపోవడంతో భయపడ్డాడు.

ఆ భయంతో అతడు వెంటనే స్పృహ తప్పి కిందపడిపోయాడు. మనీశ్ శంకర్ విషయంలో టీచర్లు కూడా ఖంగారుపడి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా మనీశ్ మేనత్త దీనిపై స్పందిస్తూ..‘బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లో సుమారు 500 మంది కంటె ఎక్కువ మంది విద్యార్థినులు ఉన్నారు. నా మేనల్లుడికి ఆ పాఠశాలలోని మెయిన్‌ హాలులో సీటు కేటాయించారు. ఒక్కసారిగా తన చుట్టూ అంత మంది విద్యార్థినిలను చూసి మనీశ్‌ కంగారు పడ్డాడు. అందుకే స్పృహ తప్పి పడిపోయాడు’ అని వివరించింది. దీంతో ఇలా కూడా ఎవరైనా భయపడతారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.