Complaint Against PCC Chief: రేవంత్ పై 5 నెలల్లో 500 ఫిర్యాదులు

తెలంగాణ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి భాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై ఏఐసీసీకి వందల ఫిర్యాదులు వెళ్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. నేతలు పైకి బాగానే మాట్లాడుకుంటుంన్నట్లు కనిపించినా మెయిల్స్ ద్వారా ఏఐసీసీకి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి భాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై ఏఐసీసీకి వందల ఫిర్యాదులు వెళ్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. నేతలు పైకి బాగానే మాట్లాడుకుంటుంన్నట్లు కనిపించినా మెయిల్స్ ద్వారా ఏఐసీసీకి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయలోపం, పార్టీ కార్యక్రమాలలో ఒక్కడే డిసిషన్ తీసుకోవడం లాంటివే రేవంత్ పై ఫిర్యాదులకు ముఖ్యకారణమని గాంధీభవన్ టాక్.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేయడం, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్య నేతలతో చర్చించకపోవడం, జిల్లా  పర్యటనల సమయంలో రేవంత్ సన్నిహితులుగా మెలిగేవారిని అక్కడ పోటీచేయబోయే అభ్యర్థి గా ప్రోమోట్ చేయడం, పార్టీ అధికార ప్రతినిధిలను రేవంత్ ఇష్టారాజ్యంగా నియమించుకున్నారనే ఆరోపణలు రేవంత్ పై వస్తోన్న అలిగేషన్స్.
రేవంత్ సెంట్రిక్ గా పార్టీ నడవడం, అయన దూకుడు వ్యవహారం నచ్చని పార్టీలోని ముఖ్యనేతలే ఈ ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం.

రేవంత్ వ్యవహారశైలి వల్ల పార్టీకి కలిగే ఇబ్బందులను ఇంఛార్జ్ ఠాగూర్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతేనే ఆసంతృప్తి నేతలు ఢిల్లీ పెద్దలకు మెయిల్స్ ద్వారా కంప్లయింట్స్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రోజుకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏఐసీసీ నేతలకు ఏం చేయాలో అర్ధం కావడంలేదట. రేవంత్ పై వస్తోన్న ఫిర్యాదులపై తెలంగాణ ఇంఛార్జ్ ను వివరణ అడిగినా స్పందన లేకపోవడంతో దాదాపు గా 500 పైగా రేవంత్ పై ఏఐసీసీ లో ఫిర్యాదు లు పెండింగ్ లో ఉన్నట్లు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రేవంత్ పై వచ్చే విమర్శలను బహిరంగంగా తిప్పికొట్టే నాయకులు కూడా కాంగ్రేస్ పార్టీలో ఉన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు బీజేపీ, టీఆర్ఎస్ లను ఎదుర్కొంటుంటే నాయకులు మాత్రం ఆధిపత్యం కోసం పాకులాడడం సరైన పద్దతి కాదనేది పార్టీకి లాయల్ గా ఉండే నాయకుల అభిప్రాయం. తమ నాయకుల్లో కొందరు కేసీఆర్ ని గద్దె దించడం ఎలాగో ఆలోచించడం పక్కన పెట్టి రేవంత్ ని దించడం ఎలాగో ఆలోచిస్తున్నారని ఇది పార్టీకి నష్టమని భావిస్తున్నారు.

కాంగ్రేస్ పార్టీలో నాయకులు సమన్వయాన్ని ఏర్పరచుకొని అధికారంలోకి వస్తారో, ఈగోలకు వెళ్లి అట్టర్ ప్లాపవుతారో అనేది ఎన్నికల రిజల్ట్ వరకు సస్పెన్సే.