Site icon HashtagU Telugu

50 Students Hospitalised: ఫుడ్ పాయిజనింగ్‌తో 50 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Posion

Food Posion

తెలంగాణలోని కుమురభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. హాస్టల్‌లో రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌ అధికారులు గత మూడు రోజులుగా నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని, బియ్యంలో చిన్న పురుగులు ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. సంక్షేమ పాఠశాలల్లో ఫుడ్‌పాయిజన్‌ ​​కేసులు పెరిగిపోతున్నాయని, ఇటీవల కాగజ్‌నగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కలుషిత ఆహారం కారణంగా ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే.