Site icon HashtagU Telugu

Peacocks Dead: రాజస్థాన్‌లో 50 నెమళ్లు మృతి

Peacock Dead

Peacock Dead

Peacocks Dead: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా మంకాసర్ గ్రామంలో దాదాపు 50 నెమళ్లు చనిపోయాయి. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పక్షి నెమళ్లు చనిపోవడంతో అటవీశాఖలో కలకలం రేగింది.

పశువైద్యుల ప్రాథమిక విచారణ ప్రకారం నెమళ్లు చనిపోవడానికి విషపూరితమైన పదార్ధం సేవించడమే కారణమని భావిస్తున్నారు. నెమళ్లతో పాటు కాకులు, పావురాలు, పక్షులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి. శనివారం ఉదయం నెమళ్లు, ఇతర పక్షులు చనిపోవడాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీశాఖ సిబ్బందితో పాటు పశువైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంబంధిత శాఖ పక్షుల మరణాలపై సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. దీనిపై విచారణ ప్రారంభించారు. నిందితులు ఎవరైనా క్షమించేదే లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Also Read: Ram Lala Idol: రాంలాలా విగ్రహం నలుపు రంగులోనే ఎందుకు..?