Site icon HashtagU Telugu

Bimbisara OTT: బింబిసారుడు ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

Bimbisara

Bimbisara

ఇటీవలి కాలంలో దిల్ రాజు “F3″ని  50 రోజుల తర్వాతనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు వెళ్లారు. 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలైన సినిమా కూడా ఇదే. ఇదే సూత్రాన్ని ఇతర నిర్మాతలు ఫాలో అవ్వాలనుకున్నారు. కానీ వాళ్ల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడమే ఇందుకు కారణం. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి ఆలస్యంగా వెళ్లాలని భావిస్తున్నారు.

అయితే తమ తమ సినిమాలను 10 వారాల తర్వాతనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, అయితే చాలా మంది నిర్మాతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 6 వారాలు లేదా 8 వారాలు సరిపోతాయని వారు అంటున్నారు. కానీ బింబిసారుడు మాత్రం 50 రోజుల తర్వాతనే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.