Site icon HashtagU Telugu

Oxidized Jewellery:ఆక్సిడైజ్డ్ నగలు..ఏ దుస్తులపై ధరించాలి..?

Jewelry Tips For Women 1538072083 Imresizer

Jewelry Tips For Women 1538072083 Imresizer

నిజానికి అందంగా మలచిన ఏ నగలు వేసుకున్నా యువతులు నుంచి పెద్దవారి వరకు అందంగా కనిపిస్తారు. వెండి హంగులు చేర్చిన నగలైతే….ఏ దుస్తులపై ధరించిన మెరిసిపోతారు. మనం ధరించగలిగే నగలను సెలక్ట్ చేసుకుంటే…మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన ఆభరణాలు ఇష్టపడుతుంటారు. కొందరికి బంగారు నగలైతే…మరికొందరికి వజ్రాభరణాలు, ఇంకొందరికి కవరింగ్ నగలు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు ధరిస్తుంటారు. నేటి ట్రెండ్ కు అనుగుణంగా సిల్వర్ కోటింగ్ తో కూడిన ఆభరణాలకు అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరికీ కూడా అధిక ప్రాధాన్యం ఉంది.

ముఖ్యంగా యువతుల నుంచి పెద్దవారి వరకు ఈ తరహా జువెల్లరీ ధరించేందుకు తహతహలాడుతుంటారు. కానీ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం సిల్వర్ కోటింగ్ ఆభరణాలను ఏ దుస్తులపై ధరిస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

ఆఫీస్:
ప్రతి మహిళ ఓ ప్రత్యేకమైన నగలను కలిగి ఉంటుంది. కానీ దానిపై ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియన గందరగోళంగా ఉంటుంది. ఇలా సిల్వర్ కోటింగ్ నగలను సాధారణంగా ఆఫీసుకు వెళ్లేవారు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. వెండి పొదిగిన చిన్న చిన్న స్టడ్ చెవిపోగులు, నెక్ పీస్, వేలి ఉంగరాలు, వైట్ కలర్ షర్ట్, ఫ్యాంటు ధరించండి. ఇది మీకు మెరుగైన అందంతోపాటు రూపాన్ని అందిస్తుంది.

ట్రెడిషనల్ దుస్తులు:
చాలామంది ఆ ఆక్సిడైజ్డ్ ఆభరణాలను సాంప్రదాయ దుస్తులకు ధరిస్తారు. కానీ సిల్వర్ కోటింగ్ తయారు చేసిన ఆభరణాలు ధరించినప్పుడు మీరు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. సిల్వర్ కోటింగ్ జంబో లేదా హ్యాంగింగ్ చెవిపోగులు సంప్రదాయ దుస్తులతో ధరిస్తే అందంగా కనిపిస్తారు. కుర్తీలు, చీరలపై ధరిస్తే బాగుంటుంది.

సమకాలీన దుస్తులు:
ఎండాకాలంలో తగిన దుస్తులు, నగలు ధరించడం మంచిది. మీ దుస్తులకు ఒక ప్రత్యేకతను జోడించడానికి మీరు పెద్ద నెక్లెస్ ను ధరించే బదులుగా కాప్టాన్ లేదా ఏదైనా ఫ్యూజన్ డ్రెస్సుపై సిల్వర్ కోటింగ్ త కూడిన నెక్లెస్ ను ధరించవచ్చు.

ట్రెండింగ్ టచ్:
చిన్న పూసలు, నక్షత్రాలు, షెల్లు లేదా ట్రెడిషనల్ చెవిపోగులు వంటివి మీకు కావాల్సిన దుస్తులపై ధరించవచ్చు. అయితే తప్పనిసరిగా సిల్వర్ కోటింగ్ తో ఆకృతిని కలిగి ఉండాలి. ఇవి అందర్నీ ఆకర్షిస్తాయి. సిల్వర్ ప్లేటెడ్ జ్యూవెల్లరీని లాంగ్ స్కర్ట్స్ ఉన్న డ్రెస్సులతో ధరిస్తే బెస్ట్ లుక్ వస్తుంది. దీనిపై పోనిటైల్ బాగుంటుంది. టై ఆప్ షర్టులు కూడా వేసుకోవచ్చు.

వెడ్డింగ్ సెలబ్రేషన్స్ :
వివాహ వేడుకలకు ఇలా సిల్వర్ జువెల్లరీ చాలా అందంగా ఉంటుంది. మీ రూపాన్ని మెరుగుపరుస్తుంది. చీర, లెహంగా లేదా పొడవాటి గౌనుతో ఈ రకమైన జువెల్లరీ ధరించవచ్చు. ఇండో-వెస్ట్రన్ దుస్తులతో ధరించినప్పుడు మీకు అద్భుతమైన రూపాన్ని కూడా ఇస్తుంది.