Goods Train Accident: ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు సంఖ్య పెరుగుతూ ఉంది. గతేడాది చివర్లో ఒడిశా రైలు ప్రమాదం తర్వాత పదుల సంఖ్యలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే స్వల్ప ప్రమాదాలే అయినప్పటికీ ఇక్కడ రైల్వే అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ శాఖకు భారీ నష్టం కలిగిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా బీహార్ లో మరో రైలు ప్రమాదానికి గురైంది.
బీహార్ లోని కతిహార్ గూడ్స్ రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి కతిహార్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమేద్‌పూర్ స్టేషన్ (బెంగాల్) సమీపంలో కిరోసిన్ ట్యాంకర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది.ఈ గూడ్స్ రైలుకు చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీ ప్రమాదం తప్పింది. ఎందుకంటే కిరోసిన్ తో వెళ్తున్న రైలు ప్రమాదానికి గురి కావడం ఆషామాషీ వ్యవహారం కాదు. మంటలు చెలరేగితే దాని తీవ్రత భారీగా ఉండేదని పలువురు అభిప్రాయపడనున్నారు.
గూడ్స్ రైలు సిలిగురి నుండి కతిహార్ వైపు వెళ్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన కుమేద్‌పూర్ నార్త్ క్యాబిన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతం బీహార్-బెంగాల్ సరిహద్దులో ఉంది.
Also Read: Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి