ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు (fire breaks) చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు (5 members of family die )సజీవదహనమయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మౌలోని షాపూర్ గ్రామంలోని ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారని మంగళవారం ఒక అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Also Read: 56 Killed: జాతి పోరులో 56 మంది మృతి
మౌ జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని షాపూర్ గ్రామం కోపగంజ్ PS వద్ద జరిగిన ఇంట్లో అగ్నిప్రమాదంలో ఒక మహిళ, 1 వయోజన, 3 మైనర్‌లతో సహా ఒక కుటుంబంలోని 5 మంది సభ్యులు మరణించారు. అగ్నిమాపక దళం, వైద్య & సహాయక బృందాలతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టవ్ నుండి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదిక పేర్కొందని అన్నారాయన. ఒక్కో వ్యక్తికి రూ.4 లక్షల తక్షణ సాయం కూడా ప్రకటించారు అధికారులు.