Site icon HashtagU Telugu

5% GST: ఈ కామర్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే 5 శాతం జీఎస్టీ

Apsrtc Bus

Apsrtc Bus

అమరావతి: ప్రైవేటు ఈ కామర్స్‌ పోర్టల్స్, యాప్స్‌ ద్వారా బుక్‌ చేసుకునే ఆర్టీసీ నాన్‌ ఏసీ టికెట్లపై ఏపీఎస్‌ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్‌ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని ఆర్టీసీ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Exit mobile version