Site icon HashtagU Telugu

Heart Attack: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు పండ్లు తినాల్సిందే.. అవి ఏంటంటే?

Heart Attack Food

Heart Attack Food

ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు గుండె జబ్బుల నుంచి కోలుకోగా మరి కొంతమంది మరణిస్తున్నారు. అయితే రాను రాను ఈ గుండె జబ్బుల వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్ వారికి కూడా వస్తున్నాయి. ఇప్పటికే 25 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువకులు ఎంతో మంది మరణించారు. అయితే ఇందుకు గల కారణాలు ప్రస్తుత ప్రజల జీవనశైలి ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంతే కొన్ని పండ్లను తినాలట. అయితే ఆ పండ్లను తినడం వల్ల గుండె జబ్బులను రాకుండా చాలా వరకు అధిగమించవచ్చట.

బెర్రీలు: గుండెపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్ని రకాల బెర్రీలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తాయి.

ద్రాక్ష: ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలో భారీ మొత్తంలో పాలీఫెనాల్స్ మరియు ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలో కొలెస్ట్రాల్ నియంతనలో ఉంచుతాయి. 2.5 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఆపిల్: ఆపిల్ పండు హృద్రోగులకు మేలు చేస్తుంది. అందుకే హృద్రోగులు తమ ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవచ్చు. గుండె జబ్బులకు యాపిల్ దివ్యౌషధం అని నమ్ముతారు. హైబీపీ, గుండెలో బ్లాకేజీ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఒక యాపిల్‌ను తీసుకోవాలి. యాపిల్ ను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.

నేరేడు: నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండు వేసవిలో ఎక్కువగా దొరుకుతుంది.

పుచ్చకాయ: పుచ్చకాయ గుండెకు మేలు చేస్తుంది. పుచ్చకాయ హానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే గుండెపోటుకు దారితీస్తుంది.