Site icon HashtagU Telugu

Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం

Yamuna Expressway

Yamuna Expressway

Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఓ ప్రైవేట్ వోల్వో బస్సు చక్రం ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డుపై పక్కకు వెళ్లింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన స్విఫ్ట్ కారు బస్సును ఢీకొట్టింది

ఈ సంఘటన సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. కొద్దిసేపటికే రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఎలాగోలా మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్