Uttar Pradesh Fire: యూపీలో వివాహ వేదికపై అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Fire

Fire

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించారు. నగరంలోని ఓ వివాహ వేదికలో మంటలు చెలరేగాయి.గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.ఈ అగ్నిప్రమాదం నుండి ఏడుగురిని రక్షించారు.

  Last Updated: 26 Aug 2022, 12:57 AM IST