CSK: చెన్నై ఈ మార్పులు చేయకుంటే కష్టమే

ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు చక్కటి ప్రదర్శన కనబరుస్తుండగా..

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 01:56 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు చక్కటి ప్రదర్శన కనబరుస్తుండగా.. కొన్ని సీజన్లుగా విఫలమవుతున్న కోల్ కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో పైభాగాన నిలిచాయి. ఇక మరోవైపు ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు గెలుపు బోణీ కొట్టలేకపోయాయి. ఒక్కటీ గెలవలేక అభిమానుల్ని నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు ఓటములను ఖాతాలో వేసుకోవడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో ఒక 5 మార్పులు చేసుకుంటే తిరిగి గెలుపుబాట పట్టే అవకాశముంటుంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తొలుత చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లుగా ఋతురాజ్ గైక్వాడ్ తో పాటుగా అంబటి రాయుడిని పంపించి మూడో స్థానంలో రాబిన్ ఉతప్పను బ్యాటింగ్ కు పంపాల్సిన అవసరముంది. ఎందుకంటే రాయుడు ఓపెనర్ గా ఆడిన కొన్నిమ్యాచులోనే విధ్వసం సృష్టించాడు. అలాగే ఉతప్పను మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించి నాలుగో స్థానంలో మొయిన్ అలీని బరిలోకి దించాలి తద్వారా మిడిలార్డర్ పటిష్టంగా మారుతుంది. అలాగే ఐదో స్థానంలో శివమ్ దుబేను పంపి కెప్టెన్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో వచ్చి ఫినిషర్ రోల్ పోషించాలి. ఇదే కాకుండా 38 ఏళ్ళ బ్రేవో స్థానంలో శ్రీలంక మిస్టరీ మహేష్ తీక్షణను బరిలోకి దించాలి . ఎందుకంటే ఇతడు పవర్ ప్లే లోనే వికెట్లు తీయగల సమర్థుడు. అలాగే ముఖేష్ చౌదరి స్థానంలో రాజవర్ధన్ హంగర్గేకర్ ను బరిలోకి దించాలి. ఎందుకంటే తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా రాజవర్ధన్ హంగర్గేకర్ సొంతం.ఈ నేపథ్యంలో ఈ ఐదు మార్పులు గనుక చెన్నై సూపర్ కింగ్స్ చేస్తే రాబోయే మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాదిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.