Site icon HashtagU Telugu

5 Army Soldiers Swept: వరదలో కొట్టుకుపోయిన జవాన్లు.. ఐదుగురు వీరమరణం!

5 Army Soldiers Killed

5 Army Soldiers Killed

5 Army Soldiers Swept: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో భారత ఆర్మీ జవాన్లకు పెను ప్రమాదం సంభవించింది. లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారు. భారత ఆర్మీ సైనికులతో ఈ ప్రమాదం చైనా సరిహద్దు సమీపంలో అంటే వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డి కారాకోరం శ్రేణిలో ఉంది. ఇక్కడ ఆర్మీ బేస్ ఉంది. ఈ ప్రమాదంలో జేసీఓ సహా ఐదుగురు జవాన్లు వీరమరణం (5 Army Soldiers) పొందారు.

Also Read: Pooja: దేవుడి ఫోటో లేదా విగ్రహాం దేనికి పూజలు చేయాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే?

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. ఆర్మీ ట్యాంక్ నదిలో లోతైన భాగాన్ని దాటుతుండగా అక్కడ చిక్కుకుపోయింది. ఈ సమయంలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో నీటితో నిండిపోయింది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఘర్షణ జరగలేదని స్పష్టంగా తెలిపారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. మొత్తం ఐదు మృతదేహాలను వెలికితీశారు. చుషుల్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, వాస్తవాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంక్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారని రక్షణ అధికారులు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ చెప్పారు. ఇందులో ఒక JCO, నలుగురు సైనికులు ఉన్నారు. ఒక జవాన్‌ ఆచూకీ లభించగా, మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీలో ప్రమాదానికి గురైన ట్యాంక్ భారత సైన్యానికి చెందిన T-72 ట్యాంక్. భారతదేశంలో 2400 T-72 ట్యాంకులు ఉన్నాయి. భారత సైన్యం చాలా కాలంగా ఈ ట్యాంకులను ఉపయోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ చాలా ట్యాంకులు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join