Indonesia Earthquake: భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతాలలో ఇండోనేషియా ఒకటి. అక్కడ నిత్యం భూకంప ప్రమాదం పొంచి ఉంటుంది.తాజాగా ఇండోనేషియాలోని తూర్పు మధ్య పపువా ప్రావిన్స్‌లో శనివారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాస్త్రం మరియు జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.32 గంటలకు భూకంపం సంభవించింది. దాని కేంద్రం పున్‌కాక్ జయ రీజెన్సీకి ఈశాన్యంగా 28 కి.మీ దూరంలో 100 కి.మీ లోతులో ఉందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
పాపువా ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన సీనియర్ అధికారి కరోలిన్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. కాగా భూకంపం తర్వాత ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు లేవు. భూకంపంతో ప్రమాదం లేకపోవడంతో వాతావరణ ఏజెన్సీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి