Site icon HashtagU Telugu

48 Kg Gold Paste : టాయిలెట్ లో 25 కోట్ల గోల్డ్ పేస్ట్.. నలుగురు అరెస్ట్

48 Kg Gold Paste

48 Kg Gold Paste

48 Kg Gold Paste : ఆ ముగ్గురు విమానం దిగారు..

భయంభయంగా నడుస్తూ.. ఇమిగ్రేషన్ చెకింగ్ పాయింట్ కు వెళ్లే రూట్ లో ఉన్న టాయిలెట్ లోకి వెళ్లారు..    

అక్కడి నుంచి బయటికొచ్చి ఇమిగ్రేషన్ చెకింగ్ పాయింట్ కు వెళ్ళగానే వారిని అధికారులు అరెస్ట్ చేశారు. 

ఇంతకీ టాయిలెట్ లో ఏం చేశారు ? 

అసలు విషయం ఏమిటంటే.. అరెస్టయిన ఆ ముగ్గురు స్మగ్లర్లు షార్జా నుంచి సూరత్ కు వచ్చారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ద్వారా సూరత్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వాళ్ళు తమ బ్యాగేజీలోని ఐదు బ్లాక్‌ బెల్ట్‌లలో 20 వైట్ కలర్ ప్యాకెట్లలో 43.5 కిలోల గోల్డ్ పేస్ట్ ను దాచి తీసుకొచ్చారు. 99 శాతం ప్యూరిటీ కలిగిన ఈ గోల్డ్ విలువ రూ. 25 కోట్లు(48 Kg Gold Paste) ఉంటుంది.  దీనిపై  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ముందే ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.  దీంతో ఆ ముగ్గురు ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుంచే అధికారులు ఫాలో అయ్యారు. వాళ్ళు ఎయిర్ పోర్ట్ లోని పురుషుల  టాయి లెట్ కు వెళ్లి తమతో తెచ్చిన గోల్డ్ పేస్ట్ ను దాచారు. అనంతరం ఏమీ తెలియనట్టు ఇమిగ్రేషన్ చెకింగ్ పాయింట్ కు వెళ్లారు.

Also read : Stickers on Fruits : పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో తెలుసా?

అయితే వాళ్ళను  DRI అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం చెప్పారు. “సూరత్  ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఒక అధికారితో మాకు డీల్ కుదిరింది. మేం ఇమిగ్రేషన్ చెకింగ్ పాయింట్ దాటాక  , టాయిలెట్ లో దాచిన గోల్డ్ పేస్ట్ ను బయటకు తెచ్చి ఇస్తానని అతడు చెప్పాడు. అందుకే టాయిలెట్ లో గోల్డ్ పేస్ట్ దాచాం” అని  వెల్లడించారు.  దీంతో ఆ అధికారిని కూడా DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టాయిలెట్ లో స్మగ్లర్లు దాచిన గోల్డ్ పేస్ట్ ను సీజ్ చేశారు.