కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 48 మంది(48 Died) మరణించారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కెన్యా రాజధాని నైరోబీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోండియానిలో ఈ ప్రమాదం జరిగింది. షిప్పింగ్ కంటైనర్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్టాప్‌లో ఉన్న మినీ బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో మినీ బస్సు నుజ్జునుజ్జు అయింది. బస్సు పై నుంచి నేరుగా బస్టాప్‌లో నిలబడి ఉన్న ప్రయాణికులపైకి ట్రక్కు వెళ్ళింది. ట్రక్కు కింద నలిగిపోయి ఎంతోమంది దయనీయ స్థితిలో ప్రాణాలు విడిచారు. క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also read : Electoral Bonds Sale : జూలై 3 నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం.. ఏమిటివి ?
నకూరు నగరం నుంచి కెరిచో వైపు వెళ్తున్న ట్రక్కు ఈ బీభత్సాన్ని(48 Died) సృష్టించిందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై కెరిచో గవర్నర్ ఎరిక్ ముతాయ్ విచారం వ్యక్తం చేశారు. “నా గుండె పగిలిపోయింది” అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. “కెరికో ప్రజలకు ఇది చీకటి క్షణం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు.