Site icon HashtagU Telugu

Police Stations: తెలంగాణలో కొత్తగా 40 పోలీస్ స్టేషన్స్!

Mahamood Ali

Mahamood Ali

సచివాలయం ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే హోం మంత్రి (Home Minister) మహమూద్ అలీ తన ఛాంబర్‌లో అడుగు పెట్టారు. వెంటనే జోన్ల పునర్వ్యవస్థీకరణ, 40 కొత్త పోలీస్ స్టేషన్‌లకు (Police Stations) ట్రై-కమిషనరేట్‌లలో పోస్టుల మంజూరుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) జితేందర్, డీజీపీ అంజనీకుమార్, ఏసీబీ డీజీపీ రవిగుప్తా, పోలీసు కమిషనర్లు ఆయన వెంట ఉన్నారు. కార్యక్రమంలో ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర, అదనపు డీజీపీలు సందీప్ శాండిల్య, శిఖా గోయల్, మహేశ్ ఎం. భగవత్, స్వాతి లక్రా, నాగిరెడ్డితోపాటు ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు.

Also Read: Revanth Reddy: సెక్రటేరియట్ కు రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!