4 Year Girl – Leopard : నాలుగేళ్ల పాపను లాక్కెళ్లిన చిరుత.. ఏమైందంటే.. ?

4 Year Girl - Leopard : జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పంచారీ తహసీల్‌లోని అప్పర్ భంజలా గ్రామంలోని ఓ ఇంటి నుంచి నాలుగేళ్ల పాపను చిరుతపులి లాక్కెళ్లింది. 

Published By: HashtagU Telugu Desk
Have You Seen A Leopard Doing Surya Namaskar..!

Have You Seen A Leopard Doing Sun Salutations..!

4 Year Girl – Leopard : జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పంచారీ తహసీల్‌లోని అప్పర్ భంజలా గ్రామంలోని ఓ ఇంటి నుంచి నాలుగేళ్ల పాపను చిరుతపులి లాక్కెళ్లింది.  శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుతపులి పాపను అడవిలోకి లాక్కెళ్లింది. ఈవిషయాన్ని వెంటనే స్థానిక పోలీసులు, వన్యప్రాణి విభాగానికి తెలియజేశారు. దీంతో ఈ విభాగాల సిబ్బంది రంగంలోకి దిగి పాప జాడ కోసం అడవిలో గాలించారు. అప్పర్ భంజలా  గ్రామానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పాప డెడ్ బాడీ పోలీసులకు లభ్యమైంది.  దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి.

Also read : Bapatla Road Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఇక ఈ ఘటనకు కారణమైన చిరుతపులిని పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ (4 Year Girl – Leopard) ప్రారంభించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కోసం ఫైల్‌ను సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం అందిస్తామన్నారు. అటవీ జంతువుల ముప్పు నేపథ్యంలో ఉధంపూర్ జిల్లాలో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు సాయంత్రం, తెల్లవారుజామున ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

  Last Updated: 03 Sep 2023, 11:29 AM IST