4 Tasks in June: జూన్ 30 లోపు ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు?

మాములుగా ప్రభుత్వ బడ్జెట్ నిర్ణయాల కారణంగా చాలా ఆర్థిక సంబంధమైన విషయాలు మే నెల ఆఖరికి ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని జూన్ నెలలో కూడ

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 06:30 PM IST

మాములుగా ప్రభుత్వ బడ్జెట్ నిర్ణయాల కారణంగా చాలా ఆర్థిక సంబంధమైన విషయాలు మే నెల ఆఖరికి ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని జూన్ నెలలో కూడా పరిష్కరించుకునేందుకు సమయం ఉంటుంది. ఒకవేళ వాటిని పరిష్కరించుకో లేకపోతే ఏడాది మొత్తం కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా పడాలి. కాగా జూన్ నెల ముగియడానికి ఇంకో 8రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో ఈ నెలలో చాలామంది కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం ఉద్యోగాల నుండి బ్యాంక్ లోన్లు, స్కాలర్షిప్ లు, పెన్షన్లు, ప్రభుత్వ పధకాలు ఇలా వేటికైనా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వీటిలో ఒక్కటి యాక్టీవ్ గా లేకపోయినా అందాల్సిన బెనిఫిట్స్ మిస్ అవుతాయి. కాబట్టి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఈ రెండూ లింక్ చేసుకోవడానికి గడువును జూన్ 30వరకు పెంచారు. ఈలోపు పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి ఆధార్-పాన్ కార్డ్ లింక్ కంప్లీట్ చేయాలి.
ఎవరైనా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే త్వరగా ఆ పని పూర్తీ చేయాలి.

EPFO తన గడువును మొదట మే3 వరకు నిర్ణయించింది. కానీ ఆ తరువాత జూన్ 26 వరకు గడువు పొడిగించింది. అధికపెన్షన్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే 26వ తేదీ లోపు పూర్తీ చేయాలి. అలాగే ఎస్బీఐ వారి అమృత్ కలాష్ పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకునే వారికి ఈ ఏడాది ఇదే చివరి అవకాశం. ఈ పథకంలో పెట్టుబడికి మొదట ఫిబ్రవరి 15నుండి మార్చి31వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత జూన్ 30వరకు ఇ సమయం పొడిగించారు. జూన్ 30వతేదీ లోపు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు పెట్టుబడి పెట్టవచ్చు.

అలాగే బ్యాంక్ లాకర్స్ విషయంలోనూ ఈ నెల 30 తుది గడువుగా నిలిచింది. బ్యాంక్ లాకర్ ఒప్పందాలకు రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 31, 2023 వరకు బ్యాంకులకు తుది గడువు ఇచ్చింది. ఈక్రమంలో లాకర్ తీసుకున్న ఖాతాదారుల నుండి ప్రతి బ్యాంక్ జూన్ 30వ తేదీలోపు కనీసం 50శాతం మంది నుండి సంతకాలు చేయించుకోవాలని నిబంధన పెట్టింది. అందువల్ల జూన్ 30వతేదీ లోపు బ్యాంక్ లాకర్ల విషయంలో అగ్రిమెంట్ పూర్తీ చేయాలని బ్యాంకులు తమ లాకర్ ఖాతాదారులను కోరాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఈ నెల ఆఖరిలోపు పూర్తి చేసుకోవాలి. లేదంటే వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ని కోల్పోవాల్సి ఉంటుంది.