Hyderabad: 4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

  • Written By:
  • Updated On - April 17, 2024 / 05:18 PM IST

Hyderabad: సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ SOT మదాపూర్ టీం కాటూరి సూర్య కుమార్, గుత్తుల శ్యామ్ బాబు పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని, 2 మొబైల్ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నారు.

సూర్య కుమార్ 2017లో ఉన్నత చదువుల కోసం బెంగుళూరు వెళ్లి జైన్ యూనివర్శిటీ లో B.Tech (కంప్యూటర్స్) పూర్తి చేసాడు. చెడు అలవాట్లకు అలవాటు పడి మత్తుకు బానిసగా మారాడు. తండ్రి రైల్వే డిపార్ట్మెంట్ లో ఇంజనీర్. విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. గత సంవత్సరం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం తో సైబరాబాద్ లోని చందానగర్ పోలీస్ లు అరెస్టు చేశారు. మూడు నెలలు జైలు లో గడిపి మళ్ళీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆరంభించాడు. బెంగళూరులో డ్రగ్స్ కొంటూ ఫ్రెండ్ అయిన గుత్తుల శ్యామ్‌ బాబు సాయంతో డ్రగ్స్ ను విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. 28 గ్రాముల డ్రగ్‌ ను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్రయించాలని ప్లాన్ చేయడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.