Site icon HashtagU Telugu

US Mass Shooting: అమెరికాలో సామూహిక కాల్పుల్లో నలుగురు మృతి

US Mass Shooting

US Mass Shooting

US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సామూహికంగా జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలబామా (alabama)లో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో పలువురు దారుణంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

శనివారం అర్థరాత్రి అమెరికా(us shoot)లోని అలబామాలో బార్ వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడినట్లు నివేదికలు తెలిపాయి. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లోని ఫైవ్ పాయింట్ సౌత్ ప్రాంతంలో రాత్రి 11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగినట్లు అక్కడి మీడియా నివేదించింది. కాగా అలబామా విశ్వవిద్యాలయం సమీపంలో రెస్టారెంట్లు మరియు బార్‌లు ఉంటాయి. ఆ ప్రదేశం హ్యాంగ్అవుట్ స్పాట్‌గా చూస్తారు. వారాంతరాల్లో ఆ ప్రదేశంలో భారీగా పార్టీలు జరుగుతాయి.

Also Read: Sri Lanka Elections : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ముందంజ.. ఆయన ఎవరు ?