Site icon HashtagU Telugu

Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు..నలుగురు మృతి

Rajasthan Accident

Rajasthan Accident

Rajasthan Accident: రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత 28 మందిని ఆసుపత్రికి తరలించామని, వారిలో నలుగురు మరణించారని దౌసా ఎడిఎం రాజ్‌కుమార్ కస్వా తెలిపారు. ఘటనపై విచారణ నిమిత్తం ఎస్‌డీఎంను సంఘటనా స్థలానికి పంపారు.

ప్రమాదం అనంతరం డీఎంతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జాతీయ రహదారి-21పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రయాణీకుల బస్సు కల్వర్టు రెయిలింగ్ విరిగి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడిపోయిందని చెబుతున్నారు.

Also Read: Black Heads : ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను ఇలా తొలగించుకోండి..