Gold Seized : కోల్‌కతాలో 11 కిలోల బంగారం స్వాధీనం.. న‌లుగురు అరెస్ట్‌

బారక్‌పూర్ కమిషనరేట్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి కోట్ల విలువైన 11 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం...

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 10:46 PM IST

బారక్‌పూర్ కమిషనరేట్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి కోట్ల విలువైన 11 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఉత్తర 24 పరగణా జిల్లాలోని బెల్గోరియా ప్రాంతంలో మారుతీ ఆల్టో వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వాహనంలో దాచి ఉంచిన 11 కిలోల బంగారు కడ్డీలను గుర్తించారు. వాహనం నుంచి 11 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలు, మొబైల్ ఫోన్‌లు రెండూ బ్యాగ్‌లో దాచారు. బెల్గోరియా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాన్ని అడ్డగించినట్లు డిప్యూటీ కమిషనర్ సౌత్ అజయ్ ప్రసాద్ తెలిపారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని, వారిని రంజన్ పవార్, మయూర్ మనోహర్ పాటిల్, గణేష్ చౌహాన్, సూరజిత్ ముఖర్జీగా గుర్తించామని అజయ్ తెలిపారు.