6000 Kg Bridge Theft : అలాంటి ఇలాంటి దొంగతనం కాదు..
ఏకంగా 6,000 కిలోల బరువు.. 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను దొంగిలించారు..
రాత్రికి రాత్రి దాన్ని మాయం చేశారు.. ఇంతకీ ఎలా ?
ముంబైలోని మలాడ్ (పశ్చిమ)లో రెండు ఏరియాల మధ్యనున్న డ్రెయిన్‌పై నుంచి భారీ విద్యుత్ తీగలను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఒక పెద్ద ఇనుప వంతెనను రెండేళ్ల క్రితం కట్టారు. ఈ డ్రెయిన్‌పై శాశ్వత వంతెన నిర్మాణానికి ఫండ్స్ మంజూరు కావడంతో.. ఇనుప వంతెనను తొలగించి రోడ్డు పక్కన పెట్టారు. శాశ్వత వంతెన నిర్మాణం కంప్లీట్ అయింది. కానీ రోడ్డు పక్కన పెట్టిన ఇనుప వంతెన మాత్రం ఎక్కడ వేసింది అక్కడే పడి ఉంది. దీన్ని అదునుగా భావించిన కొందరు దొంగలు రాత్రికి రాత్రి అక్కడికి పెద్ద లారీలో వచ్చారు.. తమతో తీసుకొచ్చిన గ్యాస్ కట్టింగ్ మిషన్లతో ఆ వంతెనను ముక్కలు ముక్కలుగా విడగొట్టి(6000 Kg Bridge Theft) లారీలో వేసుకొని పరారయ్యారు.
Also read : China Border-India Army : చైనా బార్డర్ లో ఇండియా ఆర్మీ యాక్టివ్.. ఎందుకంటే ?
పరిసర ప్రాంతాల సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. జూన్ 11న ఈ ఇనుప వంతెన వైపుగా పెద్ద వాహనం వెళ్లిందని గుర్తించారు. అందులో గ్యాస్ కట్టింగ్ మిషన్లు కూడా ఉన్నట్లు తేల్చారు. ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అసలు దొంగలను పట్టుకున్నారు. గతంలో ఆ వంతెన నిర్మాణ కాంట్రాక్టు తీసుకున్న సంస్థలో జాబ్ చేసిన ఒక వ్యక్తే .. వ్యక్తిగతంగా ఈ దొంగతనానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గత వారం ఆ వ్యక్తిని, దొంగతనంలో అతడికి సహకరించిన ముగ్గురిని అరెస్టు చేశారు.