Site icon HashtagU Telugu

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు

Earthquake In Pakistan

Earthquake Imresizer

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లోని ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదైంది. పపువా న్యూ గినియాలోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఆదివారం అర్థరాత్రి 2.14 గంటలకు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు ఈశాన్యంగా 273 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో రెండు రోజుల క్రితం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. గురువారం ఉదయం 6.07 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఫైజాబాద్ నుండి 265 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాటు పపువా న్యూగినియాలోనూ భూమి కంపించింది. ఇక్కడ 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read: Fire Breaks Out: మహారాష్ట్రలోని షుగర్ మిల్లులో బాయిలర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు

అంతకుముందు గురువారం టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. టర్కీలో భూమి ఎన్నిసార్లు కంపించిందో తెలియదు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ ప్రతి సెకను భయాందోళనలకు గురవుతున్నారు. ఫిబ్రవరి 6న టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపం వల్ల సంభవించిన విధ్వంసం ఎప్పటికీ పూడ్చలేనిది. భూకంప మృతుల సంఖ్య 50 వేలు దాటింది. లక్షల మంది గాయపడ్డారు. లక్షల భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.