Site icon HashtagU Telugu

Hyderabad: పోలీసులకు షాక్.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోనే భారీ చోరీ!

Hyderabad Police Comand

Hyderabad Police Comand

ఇటీవల కాలంలో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా కూడా ఈ దొంగల ముఠాలు గుంపులు గుంపులుగా వెలుగులోకి వస్తున్నారు. ఇండ్లలో,బ్యాంకు లలో,దేవాలయా లలో ఇలా ఎక్కడ చూసినా కూడా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఇలాంటి క్రమంలోనే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఏకంగా అలాంటి పోలీస్ రూమ్ లోనే దొంగతనం జరిగితే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణా లో చోటుచేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ కంట్రోల్ రూమ్ లో భారీగా దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. నేర నియంత్రణ లో భాగంగా రాష్ట్రంలోని సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేందుకు కొన్ని వందల కోట్లతో కంట్రోల్ రూమ్ నిర్మిస్తున్నారు. అయితే ఏకంగా ఇందులోనే దొంగలు పడ్డారని దాదాపుగా 38 కాపర్ బండిల్స్ ని చోరీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ కృష్ణ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.