Site icon HashtagU Telugu

LS Polls: పోలీసుల తనిఖీల్లో 37 లక్షల మద్యం పట్టివేత

Police

Police

LS Polls: లోక్ సభ ఎన్నికల సందర్భంగా నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువగల నాలుగువేల లీటర్స్ మద్యాన్ని SOT పోలీసులు పట్టుకున్నారు. సీపీ సైబరాబాద్ సూచనల ప్రకారం సైబరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో SOT పోలీసులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబంది తో కలిసి నిఘా పెట్టారు. బాచుపల్లి పీఎస్‌ ప్రాంతం లో నిబంధనలకు వ్యతిరేఖంగా తరలిస్తున్న రూ 21,53,470/- విలువగల 2597.88 లీటర్ల పట్టుకోవడం జరిగింది. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పేట్ బషీరాబాద్ పీఎస్‌ ప్రాంతం లో నిబంధనలకు వ్యతిరేఖంగా తరలిస్తున్న రూ 15,46,340/- విలువగల 1916.2 లీటర్ల పట్టుకోవడం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక SOT బాలానగర్ టీం & KPHB పోలీసులు రేడియంట్ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఏటువంటి QR code లేకుండా రూ.1,24,626/- లను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.