Site icon HashtagU Telugu

Balochistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Balochistan Blast

Balochistan Blast

Balochistan Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈద్ మిలాద్-ఉల్-నబీ పండుగ ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు పేలుడుకు యత్నించారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ దుర్ఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరణించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మసీదు సమీపంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించగా, మరో 30 మంది గాయపడినట్లు స్థానిక పోలీస్ అధికారులు సమాచారమిచ్చారు.ఈ ఘటన మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో చోటుచేసుకుంది. ఈద్ మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకుని భక్తులు ఊరేగింపు కోసం గుమిగూడుతుండగా పేలుడు సంభవించింది. కాగా.. పేలుడుకు గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

Also Read:Prakash Raj : కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెప్పిన ప్రకాశ్‌రాజ్