Site icon HashtagU Telugu

Kurnool : క‌ర్నూల్‌లో దారుణం.. వీధికుక్క‌ల దాడిలో 34 మేక‌లు మృతి

Govt Bans Dogs

Dogs

కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో వీధి కుక్క‌ల స్వైక విహారం చేశాయి. మేక‌ల‌పై వీధికుక్కల దాడి చేసి చంపాయి. ఈ ఘ‌ట‌న‌లో 34 మేకలు మృతి చెందాయి. గ్రామంలో నివాసముంటున్న రమేష్‌కు 70 మేకలు ఉన్నాయి. వీటితోనే ర‌మేష్ కుటుంబం జీవ‌నం సాగిస్తుంది. ఎప్పటిలాగే తన మందను మేత కోసం సమీపంలోని వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా వీధి కుక్కల గుంపు మేక పిల్లపై దాడి చేసింది. రమేష్ కుక్కలను తరిమివేసి మేక పిల్లలను రక్షించేలోపే దాదాపు మేకలన్నీ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాయి. 34 మేక‌లు చ‌నిపోవ‌డంతో కుటుంబ పోషణకు వేరే ఆదాయం లేదని రమేష్‌ వాపోయాడు. దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితుడు ర‌మేష్ కోరారు.