మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయం: అమిత్ షా

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
September 17

Amit Shah speech in Khammam BJP Public Event

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయమని కేంద్రహోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో మహిళారిజర్వేషన్ వర్తించదని… ఎన్నికల అనంతరం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపట్టాక… బిల్లు అమల్లోకి వస్తుందన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేపట్టనున్నామని అమిత్ షా స్పష్టం చేశారు.

బిల్లు రాకతో… లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల విధాన సభల్లో మాతృమూర్తుల ప్రాధాన్యం మరింత పెరగనుందన్నారు. జీ 20 సదస్సులో పాలనలో మహిళా ప్రాధాన్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటించిన.. కొద్దిరోజులకే ఈ బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. స్త్రీ సాధికారతను పెంచడంలో నరేంద్రమోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Also Read: KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!

  Last Updated: 21 Sep 2023, 06:08 PM IST